![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన భరణి నిన్న ఎలిమినేట్ అయ్యాడు. అయితే దీనికి ఆడియన్స్ ఓటింగ్ కారణమని నమ్మాలనిపచలేదు. ఎందుకంటే అతడికి సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు బాగానే పడ్డాయి. అయితే హౌస్ లో ఉన్న ఇమ్మాన్యుయల్ తన స్ట్రాటజీని వాడాడు అని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ గేమ్స్ లో భరణితో ఆడాల్సి వస్తే తను కచ్చితంగా తప్పుకోవాల్సి వస్తుందని ఇమ్మాన్యుయల్ తన పవరస్త్రాని రాము కోసం వాడాడు. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.
నిన్నటి ఎపిసోడ్లో సెలెబ్రిటీస్ తో మాటలు, హైపర్ ఆది పంచ్ లు , సింగర్ స్పూఫ్ పాటలు, అలాగేడ డ్యాన్స్ పర్ఫామెన్స్ లు జరిగాయి. వాటి తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఇది మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలని నాగార్జున అన్నాడు. ఈ హౌస్‌లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఇమ్మాన్యుయల్ దగ్గర ఉన్న ఆ పవరస్త్రాకి మూడు పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయొచ్చు.. రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడొచ్చు.. మూడోసారి.. ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి.. ఇక ఈ వారం ఆ పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్.. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్లీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదని నాగార్జున చెప్పాడు.
ఇమ్మాన్యుయల్ ఈ వారం ఆ పవర్‌ని ఎవరికైనా యూజ్ చేస్తావా అంటూ నాగార్జున అడుగగా.. నేను పవరస్త్ర వాడదామనుకుంటున్నా సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఈ ఆరు వారాల గేమ్స్ చూసుకుంటే రాము స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నాడు సర్.. కానీ ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన భరణి అన్న మళ్లీ కనిపించలేదు.. ఎక్కడో బాండ్స్‌లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది.. కనుక నేను రాము కోసం ఇది ఉపయోగిస్తున్నానని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. దీంతో ఇమ్మాన్యుయల్ అతని పవరస్త్ర ఉపయోగించాడు.. కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్‌లో ఉన్నారో చూద్దాం.. ఇమ్మూ నీ పవరాస్త్ర తీసుకొని చేతిలో పట్టుకొని ఉండమని నాగార్జున చెప్పాడు. భరణి-రాము మీ ఎదురుగా ఉన్న క్రాకర్స్‌ని వెలిగించండి.. అది వెలిగి అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటెడ్ ఆర్ సేఫ్ అని తెలుస్తుందంటూ నాగార్జున చెప్పారు. ఇక క్రాకర్ వెలిగించగానే రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ రాగా భరణి వెలిగించింది రెడ్ కలర్ చూపించింది. దీంతో భరణి నువ్వు ఎలిమినేట్ అయ్యావ్.. స్టేజ్ మీదకి రా అంటూ నాగార్జున పిలిచాడు.
ఇమ్మాన్యుయల్ నీ దగ్గరున్న పవర్ నువ్వు వాడావ్.. సేవింగ్ పవర్.. ఇంకా నీ పవరస్త్రాకి రెండు పవర్స్ ఉన్నాయి.. అవి ఎప్పుడు వాడాలనేది బిగ్‌బాస్ చెప్తారని నాగార్జున అన్నారు. కీలక టైమ్ లో ఓ స్ట్రాంగ్ ప్లేయర్ ని తీయడానికి ఇమ్మాన్యుయల్ తన స్ట్రాటజీని వాడాడని తెలుస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.
![]() |
![]() |